Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 2 ...

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
ద్వితీయ సర్గ

నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః |
పూజయామాస ధర్మత్మా సహశిష్యో మహామునిః ||
యథావత్ పూజితస్తేన దేవర్షిః నారదః తదా |
అపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసమ్ ||

తా|| నారదునియొక్క ఆ వచనములను విని , ధర్మాత్ముడు వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి శిష్యులతో సహా పూజింపసాగెను. యథావిధిగా ఆయనచేత పూజింపబడిన ఆ దేవర్షి నారదుడు ఆయన అనుజ్ఞతీసుకొని గగన మార్గమున వెడలిపోయెను.

స ముహూర్తం గతే యస్మిన్ దేవలోకం మునిః తదా |
జగామ తమసా తీరం జాహ్నావ్యాస్త్వవిదూరతః ||

తా|| ఆ ముహూర్తములో ఆ మహర్షి దేవలోకమునకు వెళ్ళిన పిమ్మట ఆ వాల్మీకిముని గంగాతీరమునకు సమీపమున గల తమసానదీతీరమునకు చేరెను.

స తు తీరం సమాసాద్య తమసయా మునిః తదా |
శిష్య మాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ||
అకర్దమమిదం తీర్థం భరధ్వాజ నిశామయ |
రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా ||
న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ |
ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమమ్ ||

తా|| ఆ మహర్షి తమసానదీతీరమునకు చేరి బురదలేని నిర్మలమైన జలములను చూచి తన ప్రక్కనున్న శిష్యునితో ఇట్లు పలికెను. "ఓ భరద్వాజ ! ఏ మాత్రము బురదలేని నిర్మలమైన ఈ తీర్థము సత్పురుషుని మనస్సు వలె స్వచ్చమై రమణీయముగా నున్నది. దీనిని చూడుము . నాయానా ! ఆ కలశమును తీరమునందు ఉంచి నా స్నానవస్త్రమును ఇమ్ము . ఉత్తమమైన ఈ తమసా తీర్థమందు స్నానము చేసెదను".

ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా |
ప్రాయచ్చత మునేః తస్య వల్కలం నియతో గురోః ||
సశిష్య హస్తాదాదయ వల్కలం నియతేంద్రియః |
విచచార హ పస్యంస్తత్ సర్వతో విపులం వనమ్ ||
తస్యాభ్యాశే తు మిథునం చరంతమనపాయినమ్ |
దదర్శ భగవాన్ తత్ర క్రౌంచయోః చారునిస్వనమ్ ||

తా|| వాల్మీకిచే ఆదేశింపబడిన గురుసేవాసక్తుడైన భరద్వాజుడు గురువునకు వల్కలములు ఇచ్చెను . ఆ మహర్షి శిష్యునినుండి తన వస్త్రమును గ్రహించి వనమును పూర్తిగా తిలకించుచూ ఆలోచినలోబడెను. అప్పుడు ఆ వాల్మీకి ( భగవాన్) వనసమీపమున క్షణకాలమైననూ ఎడబాటు సహింపజాలని మధురమైన ధనులు చేయుచున్న క్రౌంచ పక్షుల జంటను చూచెను.

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః |
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః ||
తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే |
భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ ||
వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా |
తామ్రశీర్షేణ మత్తేన పత్త్రిణా సహితేన వై ||

తా|| వైరనిలయుడైన నిషాదుడు ఒకడు ఆ జంట పక్షులలో మగపక్షిని వాల్మీకిముని చూచుండగనే బాణముతో కొట్టెను. ఆ బాణపు దెబ్బకి నేలపైబడి రక్త సిక్తమైన అంగములతో కొట్టుకొనుచున్న, రక్తసిక్తమైనతలతో విలవిలలాడుచున్న మగపక్షిని చూచి , అనురాగముతో మత్తిల్లిన ఆ భార్య (ఆడపక్షి) పతివియోగము తట్టుకొనలేక అతి దీనముగా ఏడవసాగెను

తథాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ |
ఋషేః ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత ||
తతః కరుణ వేదిత్వాత్ అధర్మో అయం ఇతి ద్విజః |
నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచన మబ్రవీత్ ||

తా|| ఆ నిషాదునిచే పడగొట్టబడిన అ క్రౌంచ పక్షిని చూచి ధర్మాత్ముడైన ఋషి హృదయములో కరుణారసము పొంగి పొరలెను. ఆ రోదించుచున్న క్రౌంచ పక్షిని చూచి కరుణచే వేధింపబడిన ఆ ఋషి ఆ జంటను విడదీయుట అధర్మమని తలచి ఇట్లు పలికెను.

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః |
యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితః ||

తా|| 'ఓ నిషాదా ! క్రౌంచపక్షుల జంట లో కామపరవశమైన ఒక పక్షిని చంపితివి అఒదువలన్ నీవు శాశ్వతముగా అపకీర్తి పొందెదవు గాక '.

తస్త్యైవం బ్రువత శ్చింతా బభూవ హృది వీక్షతః |
శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా ||
చింతయన్ స మహాప్రాజ్ఞః చకార మతిమాన్ మతిమ్|
శిష్యం చైవ బ్రవీద్వాక్యం ఇదం స మునిపుంగవః ||
పాదబద్ధో అక్షరసమః తంత్రీలయ సమన్వితః |
శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా ||

తా|| ఆవిధముగా హ్రుదయాస్పదముతోపలికిన మాటలతో ఆ ఋషి హృదయములో ఆలోచన చెలరేగెను. ' ఈ పక్షివిషయమున శోకాతురడనై ఏమి పలికితిని 'అని. మిక్కిలి ప్రజ్ఞాశాలుడు శాస్త్రములు తెలిసినవాడు అయిన అ మునిపుంగవుడు ఇట్లాలోచించుచూ తన శిష్యునితో ఇట్లు పలికెను. నేను పలికిన పద సమూహము సమానాక్షరములుగలది నాలుగు పాదములతో నున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది కనుక ఇది చందోబద్ధమైన శ్లోకమే !

శిష్యస్తు తస్య బ్రువతే మునేర్వాక్యం అనుత్తమమ్ |
ప్రతి జగ్రాహ సంహృష్టః తస్య తుష్టో అభవద్గురుః ||
సః అభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి |
తమేవ చింతయన్నర్థం ఉపావర్తత వై మునిః ||
భరద్వాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్ గురోః |
కలశం పూర్ణమాదాయ పృష్ఠతో అనుజగామ హ ||
స ప్రవిశ్యాశ్రమ పదం శిష్యే ణ సహ ద్ధర్మవిత్ |
ఉపవిష్ఠః కథాశ్చాన్యాః చకార ధ్యానమాస్థితః ||

తా|| ఆ విధముగ పలికిన ముని వచనములను ఆ శిష్యుడు సంతోషముతో స్వీకరించెను '. దానితో అ మహర్షియూ మిక్కిలి సంతుష్టుడాయెను. ఆ మహర్షి ఆ తీర్థములో యధావిధిగా అభిషేకమొనర్చి , అప్రయత్నముగా పలకబడిన శ్లోకార్థమును స్మరించుచూ తన ఆశ్రమమునకు చేరెను. అప్పుడు వినీతుడు , గురువు చెప్పిన శ్లోకమును వినినవాడు అయిన భరద్వాజుడను శిష్యుడు కలశములో ఉదకమును నింపుకొని గురువుగారివెంట ఆశ్రమమునకు వచ్చెను. ఆ మహర్షి శిష్యునితో సహ ఆశ్రమమునకు వచ్చి ధర్మకార్యములు నిర్వర్తించెను. పిమ్మట సుఖాసీనుడై కథాప్రసంగములను చేసి ధ్యానమగ్నుడాయెను.

అజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః |
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుంగవమ్ ||

తా|| అప్పుడు సృష్ఠికర్త అధిపతి , చతుర్ముఖుడు . మహాతేజోవంతుడైన బ్రహ్మ స్వయముగా ఆ వాల్మికిమహర్షిని చూచుటకై ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను.

వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః |
ప్రాంజలిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మితః ||
పూజయామాస తం దేవం పాదార్ఘ్యాసనవందనైః |
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వాsనామయమవ్యయమ్ ||
అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే |
వాల్మీకయే చ ఋషయే సందిదేశానం తతః ||

తా|| ఆ దేవుని పాద్యమును అర్ఘ్యమును నమస్కారములను సమర్పించి సుఖాసీనుని గావించి స్తుతించెను. అంతట వాల్మీకి మహర్షి ఆయనను చూచి పరమాశ్చర్యముతో వెంటనే లేచి ప్రాంజలి ఘటించి కుశలప్రశ్నలు గావించెను. అ భగవానుడు ఆసనముపై ఆసీనుడై వాల్మీకి మహర్షిని కూర్చొనుటకు ఆదేశించెను.

బ్రహ్మణా సమమనుజ్ఞాతః సోsప్యుపావిశదాసనే |
ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే ||
తద్గతేనైవ మనసా వాల్మీకిః ధ్యానమాస్థితః |
పాపాత్మనా కృతం కష్టం వైర గ్రహణబుద్ధినా ||
యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్ |
శోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోక మిమం పునః ||
జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః |||

తా|| సాక్షాత్తు లోక పితమహ అయిన బ్రహ్మయొక్క ఆజ్ఞతో ఆసీను డైనప్పటికి, మనస్సులో పాపాత్ముడైన ఆకిరాతకుని చేసిన పని మెదలుచుండెను. మధురధ్వనిచేయుచున్న క్రౌంచపక్షిని అకారణముగా హతమార్చెను గదా అని. ఆ దృశ్యమునే తలంచుచూ క్రౌంచి పక్షి దురవస్థను స్మరించుచూ అప్రయత్నముగా తను చెప్పిన శ్లోకమును మనస్సులో మరల పఠించెను.

తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ మునిపుంగవం |
శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచక్షణా ||
మచ్చందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ |
రామస్య చరితం సర్వం కురు త్వం ఋషిసత్తమ ||
ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః |
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్చ్రుతమ్ ||

తా|| అప్పుడు బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో పలికెను. " నీవు పలికిన మాటలు చందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింప పనిలేదు. ఓ బ్రహ్మణోత్తమా ! ఈ వాక్కు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషిసత్తమా ! నీవు రామచరితము సర్వమును రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు , గుణవంతుడు , ధీమంతుడు. నారదునిచే చెప్పబడిన అట్టి రామచరితమును లోకమునకు వర్ణింపుము

రహస్యం చ ప్రకాశం యద్వృత్తం తస్య ధీమతః |
రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః ||
వైదేహ్యాచ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః |
తచ్చాప్య విదిదితం సర్వం విదితం తే భవిష్యతి ||
నతే వాగ వృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి |
కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్ ||

తా|| రాముని సౌమితృని, రాక్షసుల చరితము రహస్యమైనవి ప్రకాశమైనవి అన్నింటినీ వివరింపుము. వైదేహి చరితముకూడా ప్రసిద్ధమైనది రహస్యమైనది. నీకు విదితము కానిది కూడా విదితము అగును. అ కావ్యములో అనృతము ఎక్కడావుండదు. పుణ్యమైన రామకథను ఆ విధముగా మనోరమమైన శ్లోకబద్ధముగా రచించుము.

యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే |
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ||
యావద్రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి |
తావదూర్ధ్వమధశ్చ త్వం ముల్లోకేషు నివత్స్యసి |

తా|| ఈ భూమండలములో పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాధ సమస్త లోకములందూ కీర్తింపబడును. నీచే కృతించబడిన రామకథ కీర్తించినంతవరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలో వ్యాపించుచుండును.

ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మా తత్రైవాంతరధీయత |
తతః సశిష్యో వాల్మీకిః మునిర్విస్మయ మాయయౌ ||
తస్య శిష్యాః తతః సర్వే జగుః శ్లోకమిమం పునః |
ముహుర్ముహుః ప్రీయమాణః ప్రాహుశ్చ భృశవిస్మితా ||
సమాక్షరైః చతుర్భిర్యః పాదై ర్గీతో మహర్షిణా |
సోsనువ్యాహరణాద్భూయః శోకః శ్లోకత్వమాగతః ||
తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేః భావితాత్మనః |
కృత్శ్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహమ్ ||

తా|| ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచటనే అంతర్థానమయ్యెను. ఆప్పుడు వాల్మీకి మహముని శిష్యులతో సహా ఆశ్చర్యము పొందిరి. ఆయన శిష్యులు అందరూ ఆ శ్లోకమును మళ్ళీ మళ్ళీ ప్రీతితో గానముచేసి వారి అనందాశ్చర్యములను ప్రకటించిరి. సమాక్షరములతో నాలుగు పాదములతో గల శ్లోకమును మహర్షిచే గీతింపబడినది. శ్లోకము మిక్కిలి ప్రసిద్ధి పొందినది. శోకమే శ్లోకరూపములో వెలువడెను . అంతట ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించినవాడై " ఈ రామయణ కావ్యము పూర్తిగా ఇట్టి శ్లోకములతో నే రచించెదను" అని సంకల్పము చేసెను.

ఉదారవృత్తార్థ పదైర్మనోరమైః
తదాస్య రామస్య చకార కిర్తిమాన్ |
సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్యముదారధీర్ముని ||

తా|| వాల్మీకి మహముని ఉదారములగు వృత్తములతో అర్థవంతములగు వచనములతో మనోహరములగు శ్లోకములతో సమానాక్షరములతో అలరారుచుండెడి వందలకొలది శ్లోకములతో యశస్సు గలవారికి కూడా కీర్తిని కలిగించు నది అగు కావ్యమును రచించెను.

తదుపగత సమాససంధియోగం
సమమధురోపనతార్ధ వాక్యబద్ధమ్ |
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్ ||

తా|| శ్రీరామాయణము సమాసములు సంధులు పదములతో శాస్త్రానుసారముగా గ్రంధింపబడిన మహాకావ్యము . సమములు మధురములు స్పష్ఠముగా అర్థమును ప్రతిపాదించు వాక్యములతో గూడినది. రామాయణము రఘువంశములో శ్రేష్ఠుడగు రాముని చరితము చెప్పునది. ఇందు దశకంఠుడగు రావణుని వధకూడా చెప్పబడును.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే
ద్వీతీయ సర్గః ||
|| ఓమ్ తత్ సత్ ||